తన 170వ సినిమాకు సంబంధించిన తన తదుపరి ప్రాజెక్ట్‌పై రజనీకాంత్ సంతకం చేశారు.
టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని తాము బ్యాంక్రోల్
చేయనున్నామని లైకా ప్రొడక్షన్స్ గురువారం ట్విట్టర్లో ప్రకటించింది. ఈ చిత్రం
2024లో విడుదల కానుందని ఆ ప్రకటనలో, ధృవీకరించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మాతగా తలైవర్
క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఇంతకీ ఈ సినిమాను డైరెక్ట్
చేయబోతున్నదెవరో కాదు.. టి.జె.జ్ఞానవేల్. ఈయన దర్శకత్వంలో 2021లో
వచ్చిన ‘జై భీమ్’ మూవీ ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.
ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం
తర్వాత జ్ఞానవేల్ ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై అందరిలో క్యూరియాసిటీ
పెంచింది. అయితే గత కొన్ని రోజులుగా రజినీకాంత్‌తో ఈ దర్శకుడు సినిమా
చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన
కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే
తలైవర్ 170వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటికే
రజనీకాంత్ తన 168వ చిత్రంగా జైలర్ సినిమాను పూర్తి చేయనేలేదు. అదే సమయంలో
తన 169వ చిత్రంగా రూపొందనున్న లాల్ సలామ్‌లో అతిథి పాత్రలో
నటిస్తున్నారు. ఇవి పూర్తి కాకుండా రజినీకాంత్ 170వ సినిమాకు సంబంధించిన
ప్రకటన వచ్చేసింది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని
మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు.