బాలీవుడ్ ప్రముఖ నటి సుస్మితా సేన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో కూడా సుస్మితా సేన్ సినిమాలు చేశారు.
ప్రస్తుతం ఆమె గురించి పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. కొన్ని రోజుల క్రితం
తనకు మొదటి గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో సుస్మిత తెలిపారు. ఆమె స్వయంగా
చేసిన ఈ పోస్టు వెంటనే విపరీతంగా వైరల్ అయింది. ఫ్యాన్స్ అందరూ తను ఎలా
ఉన్నారో కనుక్కోవడం ప్రారంభించారు. గురువారం సుస్మితా సేన్ తన అధికారిక
ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తాజా పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ ఇన్‌స్టా
పోస్ట్‌లో సుస్మితా సేన్ తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో
క్యాప్షన్‌లో సుస్మితా సేన్ ఇలా రాశారు ‘నీ హృదయాన్ని సంతోషంగా, ధైర్యంగా
ఉంచమని నా తండ్రి సుబీర్ సేన్ చెప్పారు. అవసరమైనప్పుడు అది మీకు అండగా
ఉంటుంది. కొద్దిరోజుల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత
యాంజియోప్లాస్టీ చేసి, స్టెంట్ వేశారు. నా గుండె పెద్దదని గుండె నిపుణుడు
చెప్పారు. ‘సరైన సమయంలో నాకు సహాయం చేసిన, సపోర్ట్ చేసిన చాలా మందికి నేను
ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అది వేరే పోస్ట్‌లో చెబుతాను. ఈ పోస్ట్
ద్వారా అంతా బాగానే ఉందని, నేను మళ్ళీ జీవితానికి సిద్ధంగా ఉన్నాననే
శుభవార్తను నా శ్రేయోభిలాషులకు, ప్రియమైనవారికి తెలియజేయాలనుకుంటున్నాను. నేను
మీ అందరినీ చాలా ప్రేమిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.