అయినా నాటు నాటు పాటకు దుమ్ముదులిపేసిలా ఆలియా స్టెప్పులు
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ
ప్రపంచవ్యాప్తంగా నాటునాటు పాట మార్మోగిపోతోంది. తాజాగా ఈ పాటకు ఆర్ఆర్ఆర్
బ్యూటీ ఆలియా భట్ చిందేసింది. అది కూడా చీరలో! అంతేకాదు, బిడ్డకు జన్మనిచ్చిన
తర్వాత ఆలియా ఇలా స్టేజీపై స్టెప్పులేయడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం.
ఆదివారం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి ఆలియా హాజరైంది. గంగూబాయి
కఠియావాడి, డార్లింగ్స్‌కు గానూ ఆమెకు రెండు అవార్డులు వచ్చినట్లు
తెలుస్తోంది. ఈ సంతోషంలో ఆలియా తన డ్యాన్స్‌తో అభిమానులను హుషారెత్తించింది.
తను నటించిన హిట్ సినిమాల్లోని పాటలకు కాలు కదిపిందీ హీరోయిన్. ఈ క్రమంలో
అక్కడున్న వ్యాఖ్యాతలు ఆయుష్మాన్ ఖురానా, అపరశక్తి ఖురానాతో కలిసి నాటు నాటు
పాట హిందీ వర్షన్‌కు దుమ్ము దులిపేలా స్టెప్పులేసింది అన్నారు. ఓ అభిమాని ఈ
వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది. ఆలియా
గ్రేస్‌ను చూసిన ఫ్యాన్స్.. ‘నాలుగు నెలల కిందటే పాపకు జన్మనిచ్చింది.
అంతలోనే ఎంత జోరుగా డ్యాన్స్ చేస్తోందో, నీకు ఎవరూ సాటి లేరు..’ అంటూ
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.