మద్యం మానేయడంపై జావేద్ అక్తర్ అసక్తికర వ్యాఖ్యలు
గతంలో ఆల్కహాల్‌తో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో
జావేద్ అక్తర్ చెప్పాడు. మద్యపానం మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక
రాత్రి రమ్ బాటిల్ మొత్తం తాగేసినట్లు చెప్పాడు. ఇకపై మద్యం ముట్టుకోనని
ప్రతిజ్ఞ చేశాడు. అతను కెన్యాలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మరుసటి రోజు
ఉదయం, అతను లండన్ వెళ్లి తన భార్య, నటి షబానా అజ్మీని కలవాల్సి ఉంది.
“నేను మద్యాన్ని వదిలేసినప్పుడు నేను కెన్యాలో ఉన్నాను. మరుసటి రోజు, నేను
లండన్ వెళ్ళవలసి వచ్చింది. షబానా హీత్రో వద్ద నన్ను రిసీవ్ చేసుకోవడానికి
వచ్చింది. నేను రాత్రంతా మద్యం సేవించాను. నేను మొత్తం బాటిల్ పూర్తి చేశాను.
అని చెప్పాడు. తన స్వంత అంగీకారం ప్రకారం 1991 లో మద్యపానం మానేసినట్లు ABP
ఐడియాస్ ఆఫ్ ఇండియా 2023 సమ్మిట్‌లో వెల్లడించాడు.