బాలీవుడ్లో అనిశ్చితి గురించి యంగ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా స్పందించారు.
మొదటిసారిగా శ్రద్ధా కపూర్‌తో కలిసి అతని రాబోయే విడుదల తు ఝూతి మైన్ మక్కార్
ప్రమోషన్ కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన
ప్రశ్నకు రణబీర్ సమాధానమిచ్చారు. షారుఖ్ ఖాన్ కు చెందిన పఠాన్ విడుదలైన నాలుగు
వారాల తర్వాత కూడా బాక్సాఫీస్‌ను శాసిస్తోందని, ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుందని
ప్రశ్నించారు. “మీరు ఏమి చెప్తున్నారు? మీరు పఠాన్ బాక్సాఫీస్ కలెక్షన్
చూడలేదా?” అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో
ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
మీడియా ఇంటరాక్షన్ సమయంలో జర్నలిస్ట్ మరో ప్రశ్న అడగడం కొనసాగించగా…
రణబీర్ ఇంకా ఇలా అన్నాడు “బీబీసీ న్యూస్… ఈ రోజుల్లో మీ కంపెనీలో ఏదో
జరుగుతోందని నేను అనుకుంటున్నాను. దాని సంగతేమిటి. ముందు నువ్వు చెప్పు.” అని
అనడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.