సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్
బెంగళూరు : నందమూరి తారకరత్న కన్నుముశారు. తారకరత్న మృతిని వైద్యులు
ధృవీకరించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో
చికిత్స పొందారు. జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన తర్వాత ఆయన తీవ్ర ఆస్వస్థతకు
గురికావడంతో తారకరత్నను వెనువెంటనే స్థానికంగా ఉన్న పీఈఎస్ ఆసుపత్రికి
తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనను పరీక్షించేందుకు బెంగుళూరు
నుంచి ప్రత్యేక వైద్య బృందం హుటాహుటిన కుప్పం వచ్చింది. ఈ క్రమంలో తారకరత్నకు
మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు బెంగూళూరులోని నారాయణ హృదయాలకు
తరలించారు. నాటి నుంచి అక్కడే వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించారు. ఇటీవల
విదేశీ వైద్యుల బృందం కూడా తారకరత్న ఆరోగ్యంను పరీక్షించింది. ఆసుపత్రిలో
చికిత్సపొందుతున్న తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం యావత్తు బెంగుళూరుకి
తరలివచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వసుంధర, నారా బ్రాహ్మణి,
ప్రణతి తోపాటు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, కన్నడ నటుడు
శివరాజ్ కుమార్ కూడా ఆసుపత్రికి వచ్చారు.సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం
నిలకడగా ఉందని, ఇటీవలే ఆసుపత్రికి వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
నారాయణా హృదయలయలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో
కలిసి మాట్లాడారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, శరీరావయవాలు చక్కగా
స్పందిస్తున్నాయని ఆయన తెలిపారు. త్వరలోనే కోలుకుంటారని ఆశించిన విషయం
తెలిసిందే. కాగా, తారక్రత్న మృతి బాధాకరమని సీఎం జగన్మోహన్రెడ్డి
అన్నారు. తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.