షర్మిలా ఠాగూర్ ఒకప్పుడు ఆసేతు హిమాచల పర్యంతం అభిమానగణాలను సంపాదించి, ఎందరో
రసికుల కలలరాణిగా జేజేలు అందుకున్నారు. షర్మిల నటించిన ప్రేమకథా చిత్రాలు
చూసి, ఆమె వీరాభిమానులుగా మారిన వారెందరో! ఆమెపై అభిమానంతో తమ ఆడపిల్లలకు
‘షర్మిల’ అని నామకరణం చేసిన వారూ లేకపోలేదు. అంతలా ఆ రోజుల్లో అభిమానులను
ఆకట్టుకున్న షర్మిలకు ప్రస్తుతం 75 ఏళ్ళ వయసు. ఇప్పుడు దాదాపు 13 సంవత్సరాల
తర్వాత షర్మిలా ఠాగూర్ డిస్నీ+ హాట్‌స్టార్ చిత్రం గుల్మొహర్తో మళ్లీ
తెరపైకి రానున్నారు. ఆమె చివరిగా 2010లో దీపికా పదుకొనే, ఇమ్రాన్ ఖాన్‌లతో
కలిసి నటించిన బ్రేక్ కే బాద్ చిత్రంలో కనిపించారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన
కెరీర్లో టాప్ స్థాయికి చేరుకున్నప్పుడు కుటుంబం కోసం చిత్ర పరిశ్రమను ఎలా
విడిచిపెట్టిందీ, ఇప్పుడు ఎందుకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నదీ చెప్పారు.
షర్మిలా టాగోర్ ను మళ్ళీ నటింప చేయాలని ఎంతోమంది భావించారు. అయితే ఆ నవ్వుల
రాణి సదరు అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు. కానీ, ఈ వయసులో తనకు తగ్గ
పాత్ర లభించడంతో ఆమె నటించడానికి అంగీకరించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్
నిర్మిస్తోన్న ‘గుల్ మొహర్’లో షర్మిల నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గుల్మొహర్ విడుదలకు ముందు మాట్లాడుతూ, షర్మిల ఇలా పంచుకున్నారు, “మనం ఉన్నంత
కాలం జీవించిన మనమందరం, యువ తరాన్ని, యువకులను సత్కరించాలనే మా స్వంత కోరికను
తరచుగా విస్మరించాము. కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో ఉంది. నేను
కుటుంబాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు నేను చాలా సినిమాలను
వదిలిపెట్టాను. నేను నా కెరీర్లో పీక్‌లో ఉన్నప్పుడు హిట్‌గా నిలిచిన చాలా
సినిమాలను వదిలేశాను” అన్నారు. 1968లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం
చేసుకున్న తర్వాత ఆమె చిత్ర పరిశ్రమను విడిచిపెట్టిన విషయం తెలిసిందే.