షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద
రికార్డులు తిరగరాస్తోంది. ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా 634 కోట్ల కలెక్షన్స్
రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ వీక్ లో హయ్యెస్ట్
కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రొడక్షన్
బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹832.20 కోట్లు
వసూలు చేసింది. ఇప్పుడు షారూఖ్ ఖాన్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్
స్టాగ్రామ్ లో సూర్య కిస్డ్ సెల్ఫీని పోస్ట్ చేశాడు.
జనవరి 25న సినిమా విడుదలైనప్పటి నుంచి పఠాన్ ఓవర్సీస్లోనే ₹319 కోట్లు
వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు
చిత్రబృందం ఇటీవల ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి సంబరాలు చేసుకుంది.