భర్తపై బాలీవుడ్నటి రాఖీ సావంత్ ఆరోపణలు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్- ఆదిల్ దురానీ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగిన సంగతి
తెలిసిందే. ఇటీవలే ఆదిల్‌కు మరో అమ్మాయితో సంబంధముందని రాఖీ ఆరోపించింది. ఈ
మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. తన భర్త ఆదిల్ ఖాన్ దురానీకి
వివాహేతర సంబంధం ఉందని రాఖీ ఇటీవల ఆరోపించింది. సోమవారం మీడియాతో మాట్లాడిన
రాఖీ.. తన తల్లి జయ భేద వైద్యం కోసం ఆదిల్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. తన
భర్త ఆదిల్ ఖాన్ దురానీ తన తల్లి సర్జరీకి డబ్బు చెల్లించలేదని ఆరోపించింది.
ప్రియురాలి కోసం అతను తనను విడిచిపెట్టాడని కూడా ఆమె చెప్పింది. ఆదిల్ వల్లే
తన తల్లి చనిపోయిందని కూడా చెప్పింది. తనతో విడిపోయానని, తన స్నేహితురాలితో
కలిసి జీవిస్తున్నానని ఆదిల్ తనతో చెప్పాడని రాఖీ పేర్కొంది.