పాకిస్థానీ నటి అనౌషే అష్రాఫ్
ప్రపంచ వ్యాప్తంగా పలువురు నటులు, అభిమానులు షారుఖ్‌ను, పఠాన్ సినిమాను
అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నటి
అనౌషే అష్రాఫ్ షారుఖ్ ఖాన్ పై చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. పఠాన్ సినిమా
చూసిన అనంతరం అనౌషే అష్రాఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ప్రజలు అతన్ని అంతగా
ఇష్టపడకపోవచ్చు, మనం పాకిస్థానీలం కాబట్టి బాలీవుడ్‌ను ప్రోత్సహించకూడదని
భావిస్తున్నాము. కానీ, నాకు మాత్రం షారుఖ్ ఖాన్ యూనివర్సల్ సూపర్‌స్టార్.
కళాకారులుగా మేము సరిహద్దులు దాటి వ్యక్తులతో కనెక్ట్ అవుతామని నమ్ముతున్నాను.
ప్రపంచానికి మనం కేవలం మనుషులుగా మాత్రమే తెలుసు. కానీ షారుఖ్ మాత్రం చాలా
స్పెషల్. నేను ఎప్పటికీ షారూఖ్ ఖాన్ కు అభిమానినే అని పోస్ట్ చేసింది.
దీంతో అనౌషే అష్రాఫ్ చేసిన ఈ పోస్ట్ పాకిస్థాన్ లో వైరల్ గా మారగా పలువురు
ఆమెను విమర్శిస్తున్నారు. ఇండియాలో నటించడానికి, షారుఖ్ కంట్లో పడటానికే ఆమె
ఇలా పోస్టు చేసింది అంటూ పలువురు పాకిస్థాన్ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ
విమర్శలపై కూడా అనౌషే అష్రాఫ్ సమాధానమిస్తూ.. నా వ్యక్తిగత అభిప్రాయాలను నా
సోషల్ మీడియాలో పంచుకుంటాను అని కౌంటర్ ఇచ్చింది.