ఈ వారం ప్రారంభంలో ఆస్తి వివాదంపై ఉత్తర గోవాలోని కలాంగుట్లో గల తన
ఇంట్లో తనను “బందీగా” ఉంచారని 75 ఏళ్ల ఫ్రెంచ్ నటి మరియాన్నే బోర్గో
ఆరోపించింది. “ప్రమాదకరమైన పరిస్థితి”లో తాను ఉన్నట్లు వాపోయింది. అయితే, గోవా
పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అయిష్టత వ్యక్తం చేశారు. ఇంటికి
సంబంధించిన వివాదం సివిల్ స్వభావంతో కూడుకున్నదని, కోర్టు విచారణలో ఉందని
చెప్పారు. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన పనాజీకి సమీపంలోని బీచ్ టౌన్
కలంగుట్లోని తన నివాసంలో “భయకరమైన, ప్రమాదకరమైన పరిస్థితి”లో తాను వున్నట్లు
గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియోలో బోర్గో పేర్కొంది. ఆమె ఆస్తిపై
దావా వేసిన వ్యక్తులు విద్యుత్, నీటిని డిస్కనెక్ట్ చేశారని, దీంతో చీకటిలో
జీవించవలసి వస్తోందని ఆమె చెప్పింది.
మూడు రోజులుగా తనను ఇంట్లో “బందీగా” ఉంచారని నటి ఆరోపించింది. “ఆనందం,
శాంతి, పదవీ విరమణ” కోసం తాను ఈ ఇంటిని కొన్నానని బోర్గో చెప్పింది, అయితే గత
కొన్ని రోజులుగా పరిస్థితి చాలా భయంకరంగా ఉందనీ వాపోయింది. బోర్గో
స్నేహితుల్లో ఒకరు మాట్లాడుతూ, 2008లో న్యాయవాది ఫ్రాన్సిస్కో సౌసా నుంచి ఆమె
కొనుగోలు చేసిన ఇంటిపై చట్టపరమైన దావాకు మద్దతు ఇవ్వడానికి సప్తవర్ణ నటుడు
ట్రయల్ కోర్ట్లో ఇంజక్షన్ కోసం కేసు వేశారని చెప్పారు.
ఇంటి ప్రధాన ద్వారం మూసివేశారని, పనిమనిషిని తప్ప ఎవరినీ లోపలికి
అనుమతించడం లేదని ఆమె వాపోయింది.