సత్యభామ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జమునతెలుగింటి సత్యభామగా
గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా
వయోసంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జమున.. హైదరాబాద్లోని తన నివాసంలో
తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం
వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర
జమున మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.