బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను అభిమానులు, కోస్టార్స్
మరచిపోలేకపోతున్నారు. శనివారం సుశాంత్ జయంతి కాగా.. తన కోస్టార్, బీటౌన్
హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎన్జీవో పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసింది. అంతేకాదు
కేక్ కట్ చేసిన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్
నోట్ షేర్ చేసింది. ఇక కేక్ కటింగ్ సందర్భంగా పిల్లలతో కలిసి పాట కూడా పాడిన
సారా.. గ్రీన్ కలర్ సూట్లో సింపుల్‌గా కనిపించింది. సెలబ్రేషన్స్ వీడియోను
షేర్ చేస్తూ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్. ఇతరులను నవ్వించడమంటే నీకు
ఎంత ఇష్టమో తెలుసు’ అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇంకా తన నోట్లో..
‘నువ్వు మా అందరినీ చూస్తున్నపుడు, చంద్రుడు అమావాస్య చీకట్లను వీడుతున్నాడు.
ఈ రోజు కూడా నిన్ను నవ్వించామని ఆశిస్తున్నాను. ప్రకాశిస్తూనే ఉండు.. జై
భోలేనాథ్’ అంటూ నమస్కారంతో కూడిన ఎమోజీ యాడ్ చేసింది.
దీంతో పాటు ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసినందుకు సునిల్ అరోరాకు
ధన్యవాదాలు తెలిపింది. తనలాంటి వ్యక్తులు ప్రపంచాన్ని మెరుగైన, సురక్షితమైన,
సంతోషకరమైన ప్రదేశంగా మార్చారని.. ఆనందాన్ని పంచుతూ ఉండాలంటూ కోరింది. ఇక
సుశాంత్ 37వ పుట్టినరోజును పిల్లలతో కలిసి జరుపుకున్న సారాను అభిమానులు
ప్రశంసిస్తున్నారు.