వోల్వ్స్, లివర్‌పూల్ మధ్య జరిగిన ఎఫ్ఏ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన
సౌండ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు జట్ల మధ్య మూడవ రౌండ్
రీప్లేను ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు గ్యారీ లినేకర్
ప్రదర్శిస్తున్నప్పుడు ‘లైంగికపరమైన శబ్దాలు’ వినిపించడంతో సోషల్ మీడియాలో
అభిమానులు ప్రధానంగా చర్చించుకోసాగారు. మొబైల్ ఫోన్ నుంచి వచ్చిన శబ్దాల
కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని.. అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు బీబీసీ
నెట్వర్క్ పేర్కొంది.
యూట్యూబ్ ప్రాంక్ స్టర్ డేనియల్ జార్విస్ ఈ చర్యకు బాధ్యత వహించాడు.
మ్యాచ్ జరిగిన స్టేడియం మోలినెక్స్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన
వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. జార్విస్ అనేక సందర్భాల్లో ఇలాంటి పనులు
చేశాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పలు ఫుట్‌బాల్, క్రికెట్ గేమ్ ల కారణంగా
వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. గతంలో, జార్విస్ ఓవల్ పిచ్‌పై ఇంగ్లండ్ క్రికెటర్
జానీ బెయిర్‌స్టోను ఢీకొట్టిన సంఘటన తెలిసిందే.