హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాడ్‌ఫాదర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించిన చిత్రంకావడం.. అందులో రవితేజ కీలక పాత్ర పోషించడంతో ‘వాల్తేరు వీరయ్య’పై తొలి నుంచే హైప్ క్రియేట్ అయింది. ఇక పాటలు, టీజర్ కూడా అదిరిపోయాయి.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగాస్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వాల్తేరు వీరయ్య ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.
సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ ర్యాంప్, ఇంట్రో, బాస్ పార్టీ సాంగ్, కామెడీ, ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ యావరేజ్ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వాల్తేరు వీరయ్య యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్. సినిమాను చిరంజీవి తన భూజాన వేసుకొని నడిపించారని చెబుతున్నారు. రవితేజతో వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి.