టాలీవుడ్ లో జక్కన్నగా పిలవబడే రాజమౌళి బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో జక్కన్న గురించి తెలిసింది. ఒక తెలుగు సినిమా దర్శకుడు ఈ స్థాయి ఘనత దక్కించుకోవడం బాలీవుడ్ దర్శక నిర్మాతలకు కూడా
ఆశ్చర్యంగా ఉండి ఉంటుంది. తాజాగా రాజమౌళి అమెరికన్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రముఖ టాక్ షో లో పాల్గొనబోతున్నాడు. లేట్ నైట్ విత్ సేత్ మేయర్స్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడాడు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ టాక్ షో కు మంచి ఆదరణ వచ్చింది. అమెరికాలో ప్రేక్షకుల స్పందనపై రాజమౌళి బదులిస్తూ “ఎగ్జైటింగ్‌గా ఉంది. మేము ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాము. నేను తప్పనిసరిగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల కోసం సినిమాలు చేస్తాను. పశ్చిమ దేశాల నుంచి
మాకు ప్రశంసలు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. “సెలబ్రిటీలు, కథా రచయితలు, సినిమా దర్శకులు దీని గురించి ట్వీట్ చేయడం, సోషల్ మీడియాలో మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఇది పెరగడం ప్రారంభించింది. వారు నోటి మాటతో సినిమాను ఛాంపియన్ చేయడం ప్రారంభించారు. ‘సరే, ఇది మరింత పెరుగుతోంది’ అని అనుకున్నాము. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా వరుసగా 15 వారాల పాటు టాప్ 10 జాబితాలో నిలిచిందన్నారు. ఇది జపాన్‌లో విడుదలై సక్సెస్ సాధించిందన్నారు.