ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇండియన్ సినిమాకు ప్రత్యేకంగా నిలిచాయి.
తెలుగు మూవీ ఆర్ ఆర్ ఆర్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. రెండు విభాగాల్లో
నామినేటైన ఆర్ ఆర్ ఆర్ ఒక విభాగంలో అవార్డు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ బెస్ట్
నాన్ ఇంగ్లీష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ విభాగంలో నామినేట్ అయ్యింది. నాన్
ఇంగ్లీష్ మూవీ విభాగంలో అర్జెంటీనా చిత్రం అర్జెంటీనా 1985 విన్నర్ గా
నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రం అవార్డు కైవసం చేసుకుంది.ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ
సెలబ్రేట్ చేసుకుంటుంది. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోగా…
చిరంజీవి, ఏ ఆర్ రెహమాన్ తో పాటు పలువురు ప్రముఖులు బెస్ట్
విషెస్ తెలియజేస్తున్నారు. అవార్డు అందుకున్న కీరవాణి ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మక వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ ని
అవార్డుకి ఎంపిక చేసిన గోల్డెన్ గ్లోబ్ జ్యూరీ మెంబర్స్ కి కృతఙ్ఞతలు తెలిపిన
కీరవాణి… ఈ ఆనందాన్ని తన భార్య శ్రీవల్లితో పంచుకుంటున్నట్లు తెలిపారు. తనకు
దక్కిన ఈ గౌరవానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చంద్రబోస్, రాహుల్
సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవ కారణం అన్నారు.

హాలీవుడ్ పార్టీ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొనబడిన ఈ అవార్డులు కొంతకాలం క్రితం
వివాదాస్పదమయ్యాయి, పాలకమండలిలో ఒక్క నల్లజాతి సభ్యుడు కూడా లేడని లాస్
ఏంజిల్స్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ అవార్డులను హాలీవుడ్ ప్రతిభావంతులు,
వారి ఏజెన్సీలు, ప్రెస్ బహిష్కరించారు. HFPA అనేక తెరవెనుక మార్పులను
ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే పరిశ్రమ వారికి మరోసారి వేడెక్కింది.