బాయ్‌ఫ్రెండ్, సహనటుడు షీజన్ ఎం ఖాన్ మెడకు ఉచ్చు
తునీషా శర్మ ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తన సహనటుడు,
బాయ్‌ఫ్రెండ్ కూడాఅయిన షీజన్ ఎం ఖాన్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని
వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రియుడు షీజాన్ ఖాన్ పెట్టే టార్చర్
తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. అలీబాబా దస్తాన్ ఏ
కాబుల్ షో షూటింగ్ స్పాట్ లోని తన సహచర నటుడి మేకప్ రూంలో తునీషా శర్మ ఉరి
వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రియుడు షీజాన్ ఖాన్ ను
అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో షీజాన్ ఖాన్ గంటకో మాట
చెప్తున్నాడు. ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పడం లేదు. దీంతో అతడిపై
పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోపక్క తునీషా తల్లి కూడా తన
కూతురు ఆత్మహత్య వెనుక షీజాన్ ఖాన్ ఉన్నాడని, అతడే ఆమె మైండ్ ను పాడుచేసి
ఆత్మహత్య కు ప్రేరేపించినట్లు తెలిపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న
పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు తునీషా ను తీసుకెళ్లిన హాస్పిటల్ సీసీటీవీ పుటేజ్ ను
చెక్ చేశారు. అందులో చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను, ప్రియుడు చేతుల మీదుగా
తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇంకోపక్క అదే కారులో మరోవ్యక్తి ఆమెను
తీసుకెళ్తూ కనిపించాడు. అయితే కారులో నుంచి హాస్పిటల్ కు తీసుకొచ్చేవరకు ఆమె
బతికే ఉన్నట్లు కనిపిస్తోంది. సడెన్ గా హాస్పిటల్ లోపలికి వెళ్ళేలోపు ఆమె మృతి
చెందింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది షీజాన్ ఖాన్ చెప్పడం లేదు. అతనే ఆమెను
చంపేశాడా..? అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది..? అనే వాటి మీద
పోలీసులు విచారణ చేపట్టారు.