ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సామ్(సమంత) మరో లేడీ ఒరియెంటెడ్ మూవీ శాకుంతలం చేస్తోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. ఇక సమంతకు మయోసిటీస్ వ్యాధి రావడంతో కొత్త సినిమాలు ఒప్పుకోనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న సామ్ కు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మంచి ఎనర్జీ ఇచ్చే గిఫ్ట్ పంపాడు. అది ఒక శక్తివంతమైన మెసేజ్ తో ఎనర్జీ నింపుతూ ఫొటోను బహుమతిగా అందించాడు. ఈ ఫొటోలో సమంతను ఉక్కు మహిళ(వుమెన్ ఆఫ్ స్టీల్) గా అభివర్ణించాడు రాహుల్. దానికి స్పందిస్తూ సమంత పోస్ట్ షేర్ చేసింది. దీనికి నటి సమంత రాహుల్ రవీంద్రన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తాను త్వరలో ‘ఎప్పటికంటే బలంగా’ ఉంటానని, భయంకరమైన పోరాటాలతో పోరాడుతానని సమంత ప్రభు పేర్కొన్నారు. ఆదివారం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గిఫ్ట్‌కి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. సమంత ఉక్కు మహిళ అని పసుపు, నీలం ఫోటో ఫ్రేమ్‌లోని పదాలు చెబుతున్నాయి.