కైకాల సత్యనారాయణ తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు.
60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న కైకాల 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా
అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక,
నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా
అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి.
రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు.
1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత
ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జులై
25న జన్మించాడు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత
విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి
పట్టభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు
కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు
వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి
కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య.
ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు.
అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి
ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్
కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ
చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు
యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు. సత్యనారాయణను ఒక
ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ
సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా
కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో,
తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.ప్రతినాయకుడిగా తన
యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ
నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు
దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు.
కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా!
ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు.
పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ,
కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు, కొదమ
సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు. 1996లో అతను
రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ
అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.సిపాయి కూతురు (1959) (మొదటి సినిమా)
లవకుశ (1963)
పాండవ వనవాసం (1965)
పరమానందయ్య శిష్యుల కథ (1966)
ప్రేమనగర్ (1971)
తాతా మనవడు (1973)
నిప్పులాంటి మనిషి (1974) – షేర్ ఖాన్
జీవన జ్యోతి (1975)
సిరిసిరిమువ్వ (1976)
సెక్రటరీ (1976)
చక్రధారి (1977)
దాన వీర శూర కర్ణ (1977) – భీముడు
యమగోల (1977) -యముడు
శుభలేఖ (1982) – అంకెల ఆదిశేషయ్య
శ్రుతిలయలు (1987) – వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
రుద్రవీణ (1988)
నారీ నారీ నడుమ మురారి (1990) – జానకిరామయ్య
సూత్రధారులు (1990) – నీలకంఠయ్య
గ్యాంగ్ లీడర్ (1991) – జైలర్
భైరవ ద్వీపం (1994)
ముద్దుల ప్రియుడు (1994)
యమలీల (1994) – యముడు
ఘటోత్కచుడు (1995)- ఘటోత్కచుడు
సాహసవీరుడు – సాగరకన్య (1996)[6]
సూర్యవంశం (1998)
శుభాకాంక్షలు (1998) – సీతారామయ్య
సమరసింహారెడ్డి (1999)
మురారి (2001)
అరుంధతి (2009) *నరసింహుడు (2005)

కైకాల మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం
విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ
అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ
గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్
గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ.
సత్యనారాయణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై
ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.