దళిత వ్యతిరేకంగా పనిచేసిన పాపపు చరిత్ర చంద్రబాబుదే..
ఆయన్ను మోస్తున్న పచ్చమీడియా రాతల్ని దళితులు నమ్మరు
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున
సామాజిక న్యాయశిల్పంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాం
అందుకే..చంద్రబాబు పిచ్చికూతలు.. రామోజీ వెర్రిరాతలు
14 ఏళ్ల బాబు పరిపాలనను నినాదంగా చెప్పే దమ్ముందా..?
సూటిగా ప్రశ్నించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ
నాగార్జున
గుంటూరు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వమిదని, జగనన్న
నినాదం ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని రాష్ట్ర సాంఘిక
సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున వెల్లడించారు. ప్రెస్మీట్లో
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ
అంటరానితనం పెంచి పోషించిన చంద్రబాబు ను ప్రజలు నమ్మరన్నారు.
ఈనాడు పేపరులో ఈరోజు ఒక కథనం వచ్చింది. ‘ఎస్సీ, ఎస్టీలకు దగా..’ అనే కథనం
రాశారు. ఆ వార్తను చూడగానే ఎవరైనా అనుకుంటారు ఇది చంద్రబాబు గురించే రాశారని.
ఎందుకంటే, ఎస్సీ, ఎస్టీలను దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టినటువంటి
విద్య. దళితులను నాలుగు దశాబ్ధాలుగా వేధించడం, అగౌరవపరచడం, దాడులు చేయించడం,
అఘాయిత్యాలు చేయించడం, రాజ్యాంగబద్ధంగా దళితులకు సంక్రమించిన హక్కుల్ని
హరించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. తెలుగుదేశం పార్టీ ఒక పెత్తందారీ
పార్టీ. పూర్తిగా కులంహకార పార్టీగా చెప్పొచ్చు. టీడీపీ అన్నది ప్రతి ఒక్క
రంగంలో అంటరానితనాన్ని పెంచి పోషించే పార్టీ. చివరికి, నాలుగు దశాబ్ధాలుగా
వ్యాపారం, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య.. ఇలా ఎందులో చూసినా దళిత వ్యతిరేకంగానే
తెలుగుదేశం పార్టీ నడిచింది. దళితుల మీద పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసి పాపపు
చరిత్రను కూడగట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీకి మద్ధతుగా
నిలబడుతున్న ఎల్లో మీడియా కూడా దళిత వ్యతిరేకతలో భాగమే.
దళిత వ్యతిరేక మీడియా రాతల్ని నమ్మబోరు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ వరకు ఏ
అంశాన్ని తీసుకున్నా ఎల్లో పార్టీది, ఎల్లో మీడియాది దళిత వ్యతిరేక వైఖరే.
రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే.. ఏవేవో సమస్యలు వస్తాయంట.. ఇలాంటి
వ్యక్తుల స్టేట్మెంట్లు కూడా గొప్పగా రాసే పత్రికలని ఏమని పిలవాలి..? ఆయా
యాజమాన్యాల్ని ఎలా సంభోదించాలి..? మెజార్టీ పేదలకు, దళితులకు ఇళ్ల స్థలాలు
ఇస్తుంటే అడ్డుకుంటున్న పార్టీని మోస్తున్న పత్రికలు దళిత వ్యతిరేక మీడియాగానే
మేం భావిస్తున్నాం.. ఇదిగో 14 ఏళ్ల అధికారంలో చంద్రబాబు పేదలు, దళితులకు ఈ
పనులు చేశాడు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల వలన దళితులు ఈ విధంగా బాగుపడ్డారని
ధైర్యంగా చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా..? రాసే సత్తా ఈనాడు రామోజీరావుకు
ఉందా..? లేదంటే లేదు.
అంబేద్కర్ భావజాలంతో సాగుతోన్న పరిపాలన మాది..
దళిత వ్యతిరేకులు కాబట్టే ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా విజయవాడ, గుంటూరు
ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం పెడతాం అని ప్రకటించి.. చంద్రబాబు మాయ చేసి
తప్పుకుంది నిజం కాదా..?
అంబేద్కర్ భావజాలానికి చంద్రబాబు వ్యతిరేకుడు కాబట్టే విగ్రహం పెట్టలేదు. మా
నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే
ఎవరూ అడగకుండానే విజయవాడ నడిబొడ్డున ఒక సామాజిక న్యాయశిల్పంగా, రాజ్యాంగానికి
ప్రతిరూపంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టిస్తున్నారు అని అర్ధమైన
తర్వాత .. రోజూ తెలుగుదేశం పార్టీ, వారి మీడియా విషం కక్కుతుంది. అంబేద్కర్
భావజాలం పుణికిపుచ్చుకుని 125 అడుగుల విగ్రహం పెడుతూ దేశంలోని మిగతా
రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంది కనుకనే.. ఈ
పచ్చమీడియాకు, తెలుగుదేశం పార్టీకి వెర్రెక్కిపోతుంది.
బినామీలకేమో రుణాలు.. దళితులపై దారుణాలు
‘చంద్రబాబూ.. నేను అడుగుతున్నా…లోన్లు లోన్లు అంటున్నావే.. నీ వత్తాసిచ్చే
ఈనాడు, ఆంధ్రజ్యోతి చేత పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయిస్తున్నావు కదా.. నిజంగా
నువ్వు దళితులకు రుణాలిచ్చావా..?’ అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. బాబు సమాధానం
చెప్పాలి. మీకు మీరు బినామీ పేర్లను పెట్టి రుణాల్ని కాజేసిన మాట వాస్తవం
కాదా..? దళితులపై దారుణాలకు పాల్పడలేదా..? ఎప్పుడైనా నిజమైన దళితులకు, పేద
దళితులకు డబ్బులు ఖర్చులేకుండా.. చెప్పులు అరగకుండా..రికమెండేషన్లు లేకుండా
లోన్లు ఇచ్చావా బాబూ..? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం
నలుగురికి సాయం చేసినట్టు నటించి, ఆ కార్లు, ట్రాక్టర్లు కూడా టీడీపీ
మోతుబరులు, పెత్తందార్లు అనుభవించిన ఆ నాటి ప్రభుత్వం ఈనాడుకు బాగుందంట..
శాచురేషన్ మీద అందరికీ ఇస్తున్న జగన్ గారి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు
దగా చేసిందంట..
బాబూ.. నీకెందుకు ఓటేయ్యాలి..?
సామాజిక న్యాయ చరిత్రలో ఆర్థికంగా కానివ్వండి.. రాజకీయ అధికారం పరంగా
కానివ్వండి.. విద్యావిధానపరంగా కానివ్వండి.. మంత్రిమండలి, పదవుల పరంగా
కానివ్వండి.. ఇంతగా సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం చరిత్రలోనే లేదు కాబట్టే..
జగన్ గారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు గుండెల్లో పెట్టుకున్నాయి.
చరిత్రలో ముందెన్నడూ జరగనంత అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని పేద దళితవర్గాలకు
అందిçవ్వడం మా ముఖ్యమంత్రి తప్పా..? ఎవరైనా ఎస్సీ కులాల్లో పుట్టాలని
అనుకుంటారా.. అన్న చంద్రబాబుకు ఏ ఒక్క ఎస్సీ ఎప్పటికీ ఓటేయడు..
బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబుకు ఏ ఒక్క బీసీ ఎప్పటికీ ఓటేయడు.
గిరిజనుల బతుకులు మార్చడానికి ఏమాత్రం ఇష్టంలేకుండా 14 ఏళ్లు వారిని
అణగదొక్కిన చంద్రబాబుకు ఏ ఒక్క గిరిజనుడూ ఓటు వేయడు. ఊసరవెల్లికి మారు రూపంగా
రంగులు మార్చే చంద్రబాబుకు ఏ ఒక్క ముస్లీం ఎప్పటికీ ఓటు వేయడు. ఈ విషయం బాగా
అర్ధం అయింది కాబట్టే.. రామోజీకి, ఎల్లోమీడియాకు ఉన్నట్టుండి దళితుల మీద,
గిరిజనుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద ప్రేమ పుట్టుకు వస్తుంది. ఇది
యదార్ధం. మా వాడు, మా చంద్రబాబు ఈ వర్గాలకు ఈ మంచి చేశాడని చెప్పడానికి
ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, ఎల్లోమీడియాకు దమ్మేలేదు. బాబును మళ్లా అ«ధికారంలోకి
తేవాలనే ఒక ప్లాన్ పెట్టుకుని కుట్రపూరిత కథనాలు అల్లడమేనా రామోజీరావు
నైతికత..? మీ రాతలు, కూతలు పేపర్లులో పెట్టి దళితులను పక్కదోవపట్టించాలని ..
అన్నిరకాలుగా అణగదొక్కాలని చూస్తున్నారు.
14 ఏళ్ల బాబు పరిపాలనే నినాదంగా రాసే దమ్ముందా..?
2014 నుంచి 2019 వరకు మా చంద్రబాబు దళితులకు ఇన్ని పనులు చేశాడు.. ఓటేయండని..
అప్పటి పరిపాలనే మా విధానం అని నినాదం ఇచ్చే ధైర్యం బాబుకే లేదు. ఎందుకంటే,
వారు చేసింది ఏమీ లేదు.
సంక్షేమ పథకాలతో సామాజిక సంస్కర్త మా జగనన్న..
మా నాయకుడు జగన్మోహన్రెడ్డి మీలా కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ
వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాడని చెప్పడానికి ఒక్క డీబీటీలో నాలుగయిదు
పథకాల్ని తీసుకుందాం.. సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్ని
వర్గాల సంక్షేమ ప్రభుత్వం. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి
నిరుపేదలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ
సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు.
2019 జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు అన్ని పథకాలు, కార్యక్రమాలకు
సంబంధించి డీబీటీ, నాన్‌డీబీటీ ద్వారా రూ.3,18,036.98 కోట్లును ప్రభుత్వం
ఖర్చుచేస్తే.. 10,10,58,520 మంది లబ్ధిదారులు లబ్ధిపొందారు. ఇందులో కేవలం
ఎస్సీలకు అందించిన మొత్తం రూ.57,881.98 కోట్లు. వారికి అందిన మొత్తం
ప్రయోజనాల్లోకొస్తే 1,72,37,560గా ఉన్నాయి. అదే సమయంలో ఎస్టీలకు మొత్తం రూ.
15,511.40 కోట్లు అందిస్తే.. వారికి అందిన ప్రయోజనాల సంఖ్య 53,61,533గా ఉంది.
ఇక, పథకాలవారీగా డీబీటీలో ఎస్సీ, ఎస్టీలకు అందిన ప్రయోజనాల్ని తీసుకుంటే..
అమ్మఒడి పథకంలో ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ.19,617.53కోట్లు కాగా
44,48,865 మంది లబ్ధిదారులు సద్వినియోగం చేసుకున్నారు. వారిలో ఎస్సీలు
8,84,131 మందికి కాగా వారికి అందించిన మొత్తం రూ.3991.18 కోట్లు. ఇక ఎస్టీలకు
ఈ పథకం ద్వారా రూ.1272.52 కోట్లు అందించగా, ప్రయోజనం పొందిన వారి సంఖ్య
2,86,379గా ఉంది. వైఎస్ఆర్ రైతుభరోసా పథకంలో ఇప్పటి వరకు రూ.25,371.33
కోట్లు ఖర్చుచేయగా.. 52.38 లక్షల మంది లబ్దిదారులున్నారు. వీరిలో ఎస్సీలు 5.23
లక్షలు కాగా, వారికి రూ.2653.04 కోట్లు అందించాం. ఎస్టీలకు ఈ పథకం ద్వారా
రూ.1771.13 కోట్లు అందించగా, ప్రయోజనం పొందిన వారి సంఖ్య 3.92 లక్షల మంది.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.59,954 కోట్లు
వ్యయం చేయగా, 62,79,486 మంది లబ్ధిపొందారు. వారిలో ఎస్సీలు 11,54,354 మంది
రూ.10,184.57 కోట్లు లబ్ధిపొందారు. ఎస్టీలకు ఈ పథకం ద్వారా రూ.3524.41 కోట్లు
అందించగా, 3,71,564 మంది ప్రయోజనం పొందారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద
ప్రభుత్వం ఇప్పటివరకు రూ.14,110.62 కోట్లు వ్యయం చేయగా, 26,39,703 మంది
లబ్ధిపొందారు. వారిలో ఎస్సీలు 6,29,035 మంది కాగా, వారికి అందించిన మొత్తం
రూ.3346.57 కోట్లు. ఇదే పథకంలో ఎస్టీలకు రూ.876.79 కోట్లు అందించగా, 1,70,190
మంది ప్రయోజనం పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో ప్రభుత్వం ఇప్పటి వరకు
రూ.12,757.97 కోట్లు వ్యయం చేయగా, 78,74,438 మంది లబ్ధిదారులు ప్రయోజనం
అందుకున్నారు. వారిలో ఎస్సీలు 16,84,350 మంది కాగా, వారికి రూ.2567.85 కోట్లు
అందించారు. ఎస్టీలకు ఈ పథకం ద్వారా రూ.342.78 కోట్లు అందించగా, 3,01,121 మంది
ప్రయోజనం పొందారు. ఇక, వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం విషయానికొస్తే.. ఈ పథకంలో
ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన వ్యయం రూ. 1032.02 కోట్లు కాగా 2,74,015 మంది
లబ్ధిదారులు ఉన్నారు. వారిలో ఎస్సీలు 64,091 మంది కాగా, వారికి అందించిన
మొత్తం రూ.242.77 కోట్లు. ఎస్టీలకు ఈ పథకం ద్వారా రూ.39.92 కోట్లు అందించగా,
10,552 మంది ప్రయోజనం పొందారు.
ఇక, నాన్ డీబీటీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే..
ఈ పథకంలో ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తం రూ. 75,370 కోట్లు కాగా,
లబ్ధిదారుల సంఖ్య 30,76,018గా ఉంది. వారిలో ఎస్సీలు 6,36,732 మంది కాగా,
వారికి మొత్తం రూ.15,918.30 కోట్లు అందించాం. ఎస్టీలకు ఈ పథకం ద్వారా
రూ.3537.40 కోట్లు అందించగా, 1,41,496 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారు.
రామోజీ బూర ఊదితే బాబుకు అధికారం రాదు..
ఇంతమేర లబ్ధిజరిగితే నువ్వెందుకు రాయలేకపోతున్నావు రామోజీరావు. పేదప్రజల
పొట్టనకొట్టే పనిచేస్తున్నావు. దళితుల ఉసురు ఈనాడుకు తగులుతుంది. రామోజీరావు
బూర ఊదితే అది పగిలిపోతుంది కానీ, చంద్రబాబును ఎంత ఆకాశానికి పైకెత్తినా
అధికారం కట్టబెట్టలేరు. నైతికత ఉన్నట్లయితే వీటన్నింటినీ ఈనాడు, ఆంధ్రజ్యోతి
పత్రికలు రాయాలి. దళితులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా కంటే అదనంగా మా
ముఖ్యమంత్రి సంక్షేమాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలోని మాలపల్లె, మాదిగపల్లె,
రెల్లిపల్లెకి వెళ్దాం రండి.. మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారో చూద్దాం రండి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి
జగన్మోహన్రెడ్డి గారు ఈరోజు ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని
దమ్ముగా చెబుతున్నారు. ఈ దుష్టచతుష్టయాన్ని నమ్మరు. దళితులు మోసపోరు.
ప్రశ్నలకు సమాధానమిస్తూ..
కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న ప్రతీ పైసాను దళితులకు
ఖర్చుచేస్తున్నాం. పచ్చమీడియాకి వాళ్ల హృదయానికి, వాళ్ల పెన్నులకు కూడా ఈ
ప్రభుత్వం మీద బురదజల్లేందుకు మేం తప్పులు రాస్తున్నామని తెలుసు. విదేశీవిద్య
చంద్రబాబు హయాంలో వెర్రితలలేసింది. అప్పట్లో అవినీతి జరిగింది. విజిలెన్స్
నివేదికలు ఉన్నాయి. అంబేద్కర్ విదేశీ విద్య పథకంపై ఇంకా విచారణ కొనసాగుతూనే
ఉంది. ఇంకా అనేక కుంభకోణాలు బయటకు రాబోతున్నాయి. చంద్రబాబు సిస్టమ్‌లో ఈ ఆటో
స్కీం కు సంబంధించి రూ.48 నుంచి రూ.60 కోట్లు మూడు కంపెనీలపై సీఐడీ ఎంక్వైరీ
వేయాలని నిర్ణయించాం. ఇండస్ట్రీస్ పాలసీ విషయంలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలకు అనువుగా సంస్కరణలు తెస్తున్నాం.
పవన్‌కళ్యాణ్‌కి పేదల సంక్షేమం పట్టదు. ఆయన చంద్రబాబు కోసమే పనిచేస్తున్నాడు
కాబట్టి..