అమరావతి : ఏపి ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి,
అధికారులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇంధన పొదుపు,
సంరక్షణలో జాతీయ స్ధాయిలో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్, ఇంధన భద్రత దిశగా రాష్ట్ర
ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ
అవార్డుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో
నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా
అందుకున్న అవార్డును సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు
ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి కే.విజయానంద్, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో
ఏ.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృద్వితేజ్ చూపించారు.