65కు చేరిన మృతుల సంఖ్య
బిహార్లో కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. అదనపు ఎస్పీ సారథ్యంలో ముగ్గురు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్లు సహా 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే భయపడకుండా చెప్పాలని ప్రజలను కోరారు.