చరిత్రలోనే అతిపెద్ద ఆందోళన
లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు నర్సుల సమ్మె తలనొప్పిగా మారింది.
లక్షమందితో చరిత్రలోనే అతిపెద్దదైన సమ్మె గురువారం జరిగింది. జాతీయ ఆరోగ్య
సేవల విభాగానికి చెందిన నర్సులు ఈ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు
పరిష్కరించాలని నినాద ఫలకాలు (ప్లకార్డులు) ప్రదర్శించారు. కొత్తగా నర్సింగ్
నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా తమ జీతాల్లో
కోతలు విధిస్తున్నారని వారు ఆరోపించారు. రోగుల ఆరోగ్యమూ ముఖ్యమే అయినా తాము
కోరుకునేదీ ఆమోదయోగ్యమైన పరిష్కారమేనని అన్నారు. బ్రిటన్లో పని చేస్తున్న
నర్సుల్లో అత్యధికంగా ఫిలిప్పీన్స్ దేశస్థులు (41,090) ఉండగా, భారత్
(37,815) రెండో స్థానంలో ఉంది. రవాణా, పోస్టల్, విమానాశ్రయాల్లోని ఉద్యోగులూ
వేతన పెంపు నిమిత్తం డిమాండ్ చేస్తున్నారు.