శ్రీకాకుళం : విశాఖపట్నంలో శనివారం పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ, సీఎం వైయస్ జగన్ పర్యటనని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొని ఇద్దరూ వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. ఈ పర్యటనలో జెడ్పీ చైర్పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ముఖ్యనాయకులు, పార్టీలో వివిధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో అందరూ పాల్గోనాలని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.