శాకాహారం ఇటీవలి సంవత్సరాల్లో జీవన విధానంగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో.. వాస్తవానికి, మొక్కల ఆధారిత ఆహారం (శాకాహరం) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనడానికి పలు ఆధారాలు ఉన్నాయి. మెరుగైన హృదయ ఆరోగ్యం, బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం శాకాహారం వల్లనే సాధ్యమని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి.
అయినప్పటికీ, కొంతమంది పచ్చి, వండని మొక్కల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శాకాహారాన్ని విపరీతంగా కొ ట్టివేస్తారు. కొందరు వ్యక్తులు దాని అసలు స్థితి నుంచి మార్చబడిన లేదా ప్రాసెస్ చేయబడిన (ఓట్ లేదా బాదం పాలు వంటివి) వాటిని తినరు. ఉడకబెట్టిన వాటితో పోల్చితే పచ్చి కూరగాయలు తినడం మరింత మంచిదని చెప్పవచ్చు