ఒక కొత్త సర్వే ప్రకారం, మనలో 57శాతం మంది స్నూజ్ బటన్ను తరచుగా నొక్కుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.
స్నూజ్ బటన్ లేకుండా ఫోన్ యాప్ లేదా అలారం గడియారాన్ని వాడడానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు. సెల్ఫోన్ అతిగా స్నూజ్ చేయడం వల్ల కలిగే ప్రతికూల ఆరోగ్య ప్రభావాల గురించి నిపుణులు విస్తృత హెచ్చరికలు చేస్తున్నారు. అయినప్పటికీ దాని విస్తృత వినియోగానికే మనలో చాలామంది మొగ్గు చూపుతూ వుండడం గమనార్హం.