అమితాబచ్చన్ తాజాగా నటించిన చిత్రం “ఉంచై”. ప్రస్తుతం ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాలు పెద్ద అంచనాలు పెట్టుకున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ముంబైలోని బిటౌన్ లో ఉంచై సినిమా టీజర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు భారీగా తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, పరిణీతి చోప్రా, నీనా గుప్తా వంటి తారల బృందం అభిమానుల కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనకు షారు అక్షయ్ కుమార్, రాణి ముఖర్జీ, మాధురీ దీక్షిత్, టైగర్ ష్రాఫ్ అతని తల్లి అయేషా, నటి కాజోల్ తదితరులు తరలివచ్చారు.