బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022కు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్‌లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ ” ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ “లైట్ ది స్కై” సేవ్ ది డేట్ 07/10/22..!” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో జరగనుంది.