మార్వెల్ సినిమాస్ తో ‘కెప్టెన్ అమెరికా’గా భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయమైన హాలీవుడ్ నటుడు “క్రిస్ ఎవాన్స్”. మార్వెల్ సిరీస్ లో మొదటి అవెంజర్ గా అలరించిన ఈ 41 ఏళ్ళ నటుడు తాజాగా 2022 సంవత్సరానికి గాను పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్గా ఎంపికయ్యాడు. దీనికి క్రిస్ స్పందిస్తూ.. “పీపుల్ మ్యాగజైన్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. మా అమ్మ కూడా చాలా సంతోష పడుతుంది. నేను చేసే ప్రతి పనికి ఆమె గర్వపడుతుంది. కానీ తన కొడుకు వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్ అని చెప్పుకోడానికి, ఆమె కొంచెం ఇబ్బంది పడవచ్చు” అంటూ చమత్కారంగా వ్యాఖ్యానించా డు. అలాగే తన స్నేహితులు కూడా ఈ టైటిల్ తో తనని ఆటపట్టించవచ్చు అని చెప్పుకొచ్చాడు.