డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంకటగిరి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని డక్కిలి, వెలికల్లు,వెంబులూరు, దేవుడు వెల్లంపల్లి, మోపూరు వెల్లంపల్లి లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుండి అపూర్వ ఆదరణ కనబరిచారు. ప్రతిచోట రామ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతాల పలికారు. తన గెలుపుతో వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతానన్నారు. తన తల్లిదండ్రుల నుండి వచ్చిన వారసత్వాన్ని నమ్మినవారికి అండగా ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పటికె ఒక విజన్ రూపొందించుకున్నానని తనను మీ కుటుంబ సభ్యుడిగా భావించి మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసే హామీలను ప్రకటించారన్నారు. తెలుగుదేశం పార్టీ వారు జగన్ పాలనను పథకాలను, వాలంటీర్ వ్యవస్థను ఎద్దేవా చేశారని ఇప్పుడు వారి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో లో రెట్టింపు హామీలను ప్రకటించి జగనన్న పాలన జనం మెచ్చుకున్నారు అన్నట్టుగా ఉందన్నారు. అదేవిధంగా జగన్ పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆంధ్ర రాష్ట్రం దివాలా తీసింది అన్న పెద్దమనుషులు వారు ప్రకటించిన హామీలను ఏ విధముగా అమలు చేస్తారో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేయడం ఖాయమన్నారు. బాబు హామీలు వట్టి మాటలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలిమిలి రాంప్రసాద్ రెడ్డి, డక్కిలి సర్పంచ్ వేమక్కా, ఎంపిటిసి వెంకటరమణమ్మ , ఎంపీపీ గోను రాజశేఖర్,మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, గడ్డం రాఘవరెడ్డి, కోళ్లపూడి వేణుగోపాల్, దువ్వూరు రవీంద్రారెడ్డి, మాదిరెడ్డి ముని రామ్ రెడ్డి, మధు రెడ్డి, మురళి నాయుడు,కొల్లూరు బాలకృష్ణ, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, రాపూరు చిరంజీవి, దాసరి పోలయ్య,ఎమ్మెల్ నారాయణరెడ్డి, వేముల మల్లికార్జున్, బొల్లంపల్లి కృష్ణ, జెరాక్స్ రమణయ్య,ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు, భాస్కర్ నాయుడు, మాటుమడుగు జనార్దన్ రెడ్డి, మామిడి శ్రీనివాసులు, వడ్డీపల్లి సుబ్బు, సోషల్ మీడియా కన్వీనర్లు అనిల్ యాదవ్, రమేష్ గౌడ్ తదితరు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.