ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు
గుంటూరు, బ్యూరో ప్రతినిధి: విద్యాహక్కు చట్టం ప్రకారం, సెక్షన్ 12 (సి ) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలో అర్హులైన తక్కువ ఆదాయము గల బడుగ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, సామాజిక వర్గాల, అనాథ బాలలకు వారి బంగారు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 26 జిల్లాలకు సంబంధించి 25125 మంది బాలలకి రాష్ట్ర విద్యాశాఖ వారు ఉచితంగా ప్రవేశాలను కల్పించడం జరిగింది. వారికి పాఠశాలల యాజమాన్యాలు తప్పని సరిగా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో అత్యధిక సీట్లు గణనీయంగా పెరగడం చాలా అభినందించవలసిన విషయమని ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. బాలల హక్కుల కమిషన్ ఈ విద్యాహక్కు చట్టం పనితీరుపై విద్యా శాఖ సమన్వయంతో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్ ద్వారా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.
ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళగిరి లోని కమిషన్ కార్యాలయానికి
ఈ ఇమెయిల్ apscpcr2018@gmail కు ఫిర్యాదు చేయవచ్చని అప్పారావు సూచించారు