నిండ్ర, బ్యూరో ప్రతినిధి : రాష్ట్రం లో ఐదేళ్లు సుస్థిర పాలన అందించామని, భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపిస్తే సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా పిలుపునిచ్చారు. నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, చవరంబాకం, కె.ఆర్.పురంలలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరోసారి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, నగరిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నిండ్ర మండలం శ్రీరాంపురం, కావనూరు, చవరంబాకం, కె.ఆర్.పు రం లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజమ్మకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలుకగా, యువత జగనన్నకు రోజమ్మ కు జేజేలు పలికి బ్రహ్మరధం పట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, నగరి నియోజకవర్గంలో తాను గత ఐదేళ్ళలో అమలు చేసిన సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు క్రియాశీల సభ్యులు, జే.సి.ఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కమిటీ చైర్మన్లు, మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.