ప్రచార సభ లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్
రాష్ట్ర ప్రజలకు చెప్పిన మాట ప్రకారం పధకాలన్నీ అమలు ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. కలువాయి మండలం చవటపల్లి, లలితానగర్, గోపవరం చింతలత్మకూరు, తోపుగుంట, బాలాజీ రావు పేట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన కు ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. మండలం లోని చవటపల్లి, లలితానగర్, గోపవరం,చింతలత్మకూరు, తోపుగుంట, బాలాజీ రావు పేట గ్రామాల్లో ఆయన ఎన్నికల రోడ్ షో ప్రచారం ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా నేదురుమల్లి మాట్లాడుతూ…చంద్రబాబు కుళ్లుబోతు అని చెప్పారు.ప్రజల కు సీఎం జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తుంటే ఒప్పుకోరు అని తెలిపారు. మంచి మనస్సు ఉన్న మా రాజు మన జగనన్న ను మరల ముఖ్య మంత్రి ని చేసుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షులు మాకిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి, జడ్పీటీసీ అనీల్ కుమార్ రెడ్డి, జె సి ఎస్ కన్వీనర్ పవన్, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.