డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డక్కిలి మండల నాయకులు శనివారం డి ఉప్పరపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన పనులను సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు మంచి జరగాలంటే జగనన్న కు వెంకటగిరి వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి జనం జై కొట్టాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరాలన్నారు. ప్రజలు బాబును నమ్మరని జగన్కు అండగా ఉంటారన్న నమ్మకం వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు భాస్కర్ నాయుడు, మార్పు పవన్, మండల వైకాపా కన్వీనర్ శ్రీనివాసుల రెడ్డి, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, రాపూరు చిరంజీవి,చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.