డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని వెంకటగిరి వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించుకుందామని నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందని ప్రజలకు మంచి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని డక్కిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముమ్మరప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం వెలికల్లు, మాధవయ్య పాలెం రోడ్డు, మిట్టపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి సాధ్యమన్నారు. గత పథకాలను కొనసాగాలన్న మహిళలకు రెట్టింపు ప్రయోజనం పొందాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేసి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం అన్నారు. అవినీతి అన్యానికి తావు లేకుండా రామన్న సేవ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మధు రెడ్డి, చింతల శ్రీనివాసరెడ్డి, రాపూరు చిరంజీవి, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి,నర్రావులు. వేణుగోపాల్ నాయుడు, ఎమ్మెల్ నారాయణరెడ్డి, మాధవ రెడ్డి, మిట్టపాలెం బాబు, గోవర్ధన్ నాయుడు, బండి రమేష్ రెడ్డి, నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.