డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అవినీతి మచ్చలేని వ్యక్తిఅని సౌమ్యుడు తన మాటలకంటే చేతలతో పనులు చేయడంలో కార్యసిద్ధుడని డక్కిలి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ముక్తికంఠంతో కొనియాడుతున్నారు. మంగళవారం వెలికల్లు లో రాంకుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాభివృద్ధికి రామ్ కుమార్ రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తారని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంతో రామ్ కుమార్ కి ఒక విజన్ ఉందని అందుకు ప్రజల సహకారం, మద్దతు ఎన్నికలలో గెలుపు రామన్నకు కానుకగా ఇద్దామన్నారు. జగన్ను ముఖ్యమంత్రి చేద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేయగలిగిన పనులు మాత్రమే హామీ ఇస్తాడన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ నాయకులు మధుసూదన్ రెడ్డి, పిల్లి విష్ణువర్ధన్ రెడ్డి, శ్రావ్య రెడ్డి, రవీంద్ర రెడ్డి,మచ్చల వెంకటరమణ, నాగభూషణం రెడ్డి, గురువారెడ్డి, ఎంపీపీ రాజశేఖర్ ,మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి, పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, సంగనపల్లి సర్పంచ్ చిరంజీవి,నర్రావుల వేణుగోపాల్ నాయుడు, ఎమ్మెల్ నారాయణరెడ్డి, అరుణాచలం, మాధవ నాయుడు, మామిడి శ్రీనివాసులు, రమేష్ రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.