ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ అందించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిపై ఉంచండి
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించడం ఇష్టం లేకపోతే సంబంధిత ఉద్యోగి నుండి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ తీసుకోవాలి
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్నికలు విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకుని పోస్టల్ బ్యాలెట్ వేసుకొనే సౌకర్యం కల్పించేలా సంబందిత జిల్లా ఎన్నికల అధికారులు (డి.ఇ.ఓ లు)మరియు రిటర్నింగ్ అధికారులకు(ఆర్.ఓ లు) ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ అమరావతి సంయుక్తంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని లేఖ ద్వారా కోరింది. ఈ మేరకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కే రమేష్ కుమార్, అమరావతి జేఏసీ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ రావు శనివారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ నెంబర్ బ్లాక్ లో డిప్యూటీ ఎన్నికల అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. చూడాలని ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఎన్నికలు విధులలో వున్న ప్రతి ఉద్యోగికి ఫారం 12 అందచేసి వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకునేలా డిఇఓ, మరియు ఆర్వో లకు అదేశములు ఇవ్వాలని కోరారు. అదేవిధముగా అసెంబ్లీల వారీగా ఎంతమంది ఎన్నికల విధుల్లో తీసుకున్నారు అందులో ఎంతమందికి ఫారం -12 జారీ చేశారు? ఎంతమంది తిరిగి పోస్టల్ బ్యాలెట్ కొరకు సంబంధిత ఆర్.ఓ లకు అందజేశారు? తదితర అంశాలపై సంబంధిత జిల్లా ఎన్నికల అధికారిని అందరూ అన్ని అసెంబ్లీల రిటర్నింగ్ అధికారులతో రివ్యూ చేసేలా తగు ఆదేశాలు అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులకు జారీ చేయాలని ఏపిజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, ఏపిరెవిన్యూసర్వీసెస్ అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి కే.రమేష్ కుమార్ లేఖద్వారా అడిషనల్ సి.ఇ.ఓ యం.యన్. హారేంద్ర ప్రసాద్, ని వెలగపూడి సచివాలయంలో కలసి విజ్ఞప్తి చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి ఫారం -12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ అందించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులపై ఉంచాలని, ఒకవేళ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడం ఇష్టం లేకపోతే సంబంధిత ఉద్యోగి నుండి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ తీసుకోవాలనీ కోరారు.
ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ కొరకు ఫారం 12 సమర్పిoచడానికి గడువు మే 1 వరకు పొడిగించి నందుకు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులు వారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించు కోవడానికి, తెలంగాణ ప్రభుత్వం మాదిరి మే నెల 2024 మొదటి వారంలో ఒక ప్రత్యేక సెలవును ఇవ్వవలసినదిగా కోరారు.
ఎన్నికల విధుల నిర్వాహణలో చాలా మంది ఉద్యోగులు ప్రధానంగా ఇతర జిల్లాల నుండి ఎన్నికల డ్యూటీకి డ్రాఫ్ట్ చేయబడి, వారి ఓట్లు వివిధ జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలలో ఉండటం వాస్తవం. కావున ఎన్నిక విధులలో వున్న ప్రతి ఒక్కఉద్యోగి వారి ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని బొప్పరాజు, పలిశెట్టి మరియు కే.రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసారు.