వైఎస్ఆర్సీపీలో చేరిన 250 టీడీపీ కుటుంబాలు
డోన్ పట్టణంలో మంత్రి బుగ్గన విస్తృత ప్రచారం
నంద్యాల బ్యూరో ప్రతినిధి : డోన్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కూడా వెల్లువెత్తుతున్నాయి. శనివారం డోన్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం, శ్రీరామ దేవాలయం వీధి, కొత్తపేట, టి.ఆర్.నగర్, అక్షర స్కూల్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో ఆర్థిక మంత్రి పర్యటించారు. మంత్రి రాకతో హారతులిచ్చి ఘనంగా స్వాగతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగుల టీషర్ట్ తో పార్టీ కండువా ధరించి ఒక యువతి మంత్రి బుగ్గనతో ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ముంగిటకు వెళ్లి ఇంటింటికి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. పట్టణంలోని పాతపేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని మంత్రి బుగ్గన దర్శించుకున్నారు. మంత్రి బుగ్గన చేపట్టిన అభివృద్ధికి పట్టం కడతామంటూ జై బుగ్గన, బుగ్గన నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినదించాయి. చిన్నారులు, వృద్ధులు , మహిళలు మంత్రి బుగ్గన ఎన్నికల పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలో మంత్రి బుగ్గనకు మహిళలు అడుగడుగునా హారతి పట్టారు. పుర ప్రజలంతా మంత్రి బుగ్గన చేపట్టిన అభివృద్ధికి సంఘీభావంగా ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ..ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా మంత్రి బుగ్గన ప్రజలతో మమేకమయ్యారు.
వైఎస్ఆర్సీపీలో చేరిన 250 టీడీపీ కుటుంబాలు
డోన్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 250 టీడీపీ కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ప్యాపిలి మండలం జక్కసానిగుంట్ల గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబాలు డోన్ పట్టణంలోని మంత్రి బుగ్గన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయి. అదే మండలంలోని ఊటకొండ గ్రామంలో మరో 25 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. డోన్ మండలం తాడూరు గ్రామంలోనూ మంత్రి బుగ్గన సమక్షంలో 50 టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరాయి. అంతకుముందు డోన్ పట్టణంలోని 80 టీడీపీ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి బుగ్గన ఆహ్వానం పలికారు. పాతపేటలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకులు ఆర్య రాజవర్ధన్ ఇంటి దగ్గర నంద్యాల బీసీ సెల్ అధ్యక్షులు పోస్ట్ ప్రసాద్ ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీలో చేరాయి. రాముల దేవాలయం సమీపంలో మరో 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఇంద్రనగర్ లో అక్షర స్కూల్ వద్ద 28 వార్డుకు చెందిన 50 టీడీపీ కుటుంబాలు వైసీపీ కండువా కప్పుకున్నాయి. తాను చేసిన అభివృద్ధికి నిదర్శనమే పార్టీలో చేరికలని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్రజలు చేసిన మంచి గుర్తించి కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తమ తీర్పును స్పష్టంగా ఇస్తారని..అభివృద్ధి చేపట్టిన నాయకునికే పట్టం కడతారని మంత్రి బుగ్గన వెల్లడించారు.