తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ అధిష్టానం కీలక పదవినిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ అధికార ప్రతినిధిగా శ్రీదేవిని నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే చిలకటూరిపేట నియోజకవర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడిని రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.