తిరుపతి బ్యూరో ప్రతినిధి : తిరుమల శ్రీవారిని దర్శించుకుని, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన మూడవ స్నాతకోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సతీ సమేతంగా భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ పాల్గొని తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం 3.15 కు తిరుగు ప్రయాణం కాగా రేణిగుంట విమానాశ్రయం నందు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సాదర వీడ్కోలు పలికారు. ఏపీ సిఐడి అదనపు డిజి సంజయ్, తిరుపతి జిల్లా ఎస్పి కృష్ణ
కాంత్, ప్రోటోకాల్ ఎస్డిసి భాస్కర్ నాయుడు తదితరులు ఉప రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.