నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ, బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. అధికారులు శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. మంద తన నామినేషన్లో బీఎస్పీ అభ్యర్థిగా పేర్కొని బీ ఫామ్ సమర్పించకపోవడం, బీఎస్పీ బీ ఫామ్- యూసుఫ్ అనే వ్యక్తికి కేటాయించడంతో అధికారులు ఆయన నామినేషన్ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలనుకున్న కనీసం 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ కేవలం ఐదుగురు మాత్రమే ప్రతిపాదించడంతో.. మంద జగన్నాథం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశాన్ని కోల్పోయారు. మంద జగన్నాథం ఇటీవలనే బీఎస్పీలో చేరి తప్పనిసరిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మంద జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురి కావడం చర్చనీయాంశం అవుతోంది….