రామన్న గెలుపే లక్ష్యం గా…
రచ్చ బండ పై ఓటర్ల తో మాట మంతి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపే లక్ష్యం మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం రచ్చ బండ రాజకీయం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఓటర్ల ను ఆక ట్టుకొంటుంది. ఎన్నాడు లేని విధంగా మాదాసు కలువాయి లో ఆగి కూల్డ్రింక్స్,టెంకాయల దుకాణాల వద్ద ఆయన ప్రజల తో మాట మంతి కలిపి మాట్లాడారు. ఎన్నికల పై చర్చించడం, వైసీపీ అభ్యర్థి రామన్న, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ల ఫ్యాన్ గుర్తులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజల కు తెలియజేయడం ప్రజల్లో ఉత్సహం గా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా కారు లో కుల్లూరు వెళ్లే మాదాసు రచ్చ బండ రాజకీయం చేయడం కలువాయి మండలం లో ఒక మార్క్ గా నిలిచిం ది.ఆయన మాటలకు దుకాణాల వద్ద కు ఒకొక్కరిగా చేరుకోవడం మాదాసు చెప్పిన మాటలను ఆసక్తి గా వినడం జరిగింది.