డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్:టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలలో డక్కిలి ప్రభుత్వ హైస్కూల్ బాలికలు ఎస్ శ్రావణి (579), పి. జయశ్రీ(575) గురుకుల కళాశాల విద్యార్థిని జి.సోనీ (566) మార్కులతో మండలంలో టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా వారికి ఎంపీడీవో లీల మాధవి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, డక్కిలి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగరాజు మరియు సహచర సిబ్బంది అభినందనలు శాలువాతో సన్మానించారు. డక్కిలి మండలంలో మొత్తం 7 ప్రభుత్వ పాఠశాలలు ఒకటి గురుకుల కళాశాల. మొత్తం హాజరైన విద్యార్థులు 248, ఉత్తీర్ణత సాధించిన వారు 231(93%) హై స్కూల్ వారిగా పరీక్షలకు హాజరైన వారు మరియు ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు : అంబేద్కర్ గురుకుల కళాశాల 99-91, డక్కిలి 63-59, దగ్గవోలు 35-35, తీర్థం పాడు25-20, మోపూరు 10-8, పాతనాలపాడు 14-13, డి వడ్డిపల్లి 24-21.