మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం లో రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కుల్లూరు లో తన అనుచరులు, అభిమానులతో ఆత్మయ సమావేశం ఎర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర నేత మాదాసు గంగాధరం చెప్పారు. రాజకీయ పార్టీ లు మారే సమయంలో కొన్ని సిద్ధాంతాలను నాయకులు అనుసరించాలని చెప్పారు. నాయకుల మధ్య విబేధాలు ఉన్న ఎన్నికల సమయంలో పక్కన పెట్టి అభ్యర్థి విజయం కోసం పని చేయాలని హితవు పలికారు. వ్యక్తిగతం గా విబేధాలు ఉన్న ఎన్నికల సమయంలో చూపుకోవడం సరి కాదన్నారు. ఈ నెల 23 వ తేది న కుల్లూరు లో జరిగే ఆత్మీయ సమావేశం లో వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఒక గట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.మండలంలో వైసీపీ బలోపేతం కోసం ఓ బృహోతర కార్యక్రమం తయారు చేస్తామని పేర్కొన్నారు.మండలంలో 8 వేల ఓట్లు మెజారిటీ తీసుకరావడం లక్ష్యం గా పెట్టుకొన్నామని తెలిపారు. కలువాయి మండలం కుల్లూరు లోని ఆయన స్వగృహం లో మీడియా తో మాట్లాడారు.