డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :వెంకటగిరి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని రాబోవు ఎన్నికలలో వెంకటగిరి వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలిపించుకుందామని, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గెలిస్తే మన నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉంటుందన్నారు పలుగోడు గ్రామపంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నాయకులు. సురాయపాలెం, తిమ్మాయిపాలెం, మోపూరు రోడ్డు కూడలి నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు, పేద ప్రజలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎన్నికల కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోను రాజశేఖర్, సీనియర్ నాయకులు దశరథ రామ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వేముల మల్లికార్జున్,బొల్లంపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.