– వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట పోలీస్ బందోబస్తుతో సర్వం సిద్ధం చేశామని వెంకటగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్యానచంద్ర ఐఏఎస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఆరో కార్యాలయం చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ
రాబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి ఫామ్ వన్ నోటిఫికేషన్ ను విడుదల చేశామని నేటి నుండి 25వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫామ్ వన్ నోటిఫికేషన్ ను విడుదల చేశామని నేటి నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు నామినేషన్ కేంద్రానికి పోటీ చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తామని అభ్యర్థి రెండు ప్రాంతాలకు మించి నామినేషన్లు వేయకూడదని పేర్కొన్నారు. అదేవిధంగా నామినేషన్ వేసే అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి అని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నామినేషన్ కేంద్రం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు నూతన ఓటర్ లిస్ట్ ఈనెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు,అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించాలని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నార.