డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్:
రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అందుకు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దక్కిలి మండల వైకాపా పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం అమ్ముడూరు, శివగిరిలో తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా గ్రామంలో ప్రతి గడపగడపకు వారు ప్రచారం నిర్వహించి ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి అవుతారని సంక్షేమ పథకాలన్నీ యధావిధిగా అమలు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అమ్ముడూరు గ్రామ సర్పంచ్ ఈశ్వరయ్య నాయుడు, రాము, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ గ్రామ సర్పంచ్ సుబ్బయ్య, జే సి ఎస్ ఇన్చార్జి శ్రీనివాసులు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, జయప్రకాష్, ఆనందయ్య, శ్రీనివాసులు, వెంకటాద్రి, రాజయ్య, ఎమ్మెల్ నారాయణరెడ్డి, గోవర్ధన్ నాయుడు, మాధవ్
, కొల్లూరు బాలకృష్ణ, వెలికంటి సుబ్బు,గడ్డం వాసిరెడ్డి, రమేష్ గౌడ్,బండి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.