బాలాయపల్లి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మీరందరూ మంచి మనసుతో ఆలోచించి రామ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మీరు పిలిస్తే పలుకుతానని మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్య లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మండ లంలోని అంబలపూడి,నిండలి,వాక్యం గ్రామాలలో విస్తృత పర్యటన కార్యక్రమం మండల కన్వీనర్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీరే చూశారు అభివృద్ధి ఎవరు చేశారో మీకే తెలుసు, మీకు నాకు 15 ఏళ్లు గ్యాప్ వచ్చింది. నేను వచ్చేసా మీ అందరికీ అందు బాటులో ఉంటా.. ఏ సమస్య వచ్చినా వెంటనే తెలియజేయండి పరిష్కార్ మార్గం దగ్గరుండి చేస్తా..గారడి మాటలు నమ్మొద్దు. మీకోసం నీదురు మల్లి కుటుంబం ఎల్లవేళలా అండగా ఉంటుంది.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే :-
వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండలాన్ని తాము ఉన్నప్పుడే అభివృద్ధి చేశాం ఇప్పటికీ అలానే ఉండాలి గతంలో పరిపాలించిన వాళ్ళు ఏం చేశారు… అంటూ సూటిగా ప్రశ్నిం చారు. బాలయ్య పల్లి మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలై అనే సంతాగా కనిపిస్తుందని ఆరోపించారు. కొంతమంది వస్తారు గారడి మాట లు చెప్తారు వాళ్ళని నమ్మొద్దు… మీకు నీ నేదురు మల్లి అంటే ఓ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఓమ్ము చేయమని మాటిచ్చారు. ఎప్పుడైనా నాతో నేరుగా మీరు మాట్లాడొచ్చు. ఈ పవిత్రమైన ఓటు రామ్ కుమార్ రెడ్డి కి వేసి గెలిపిస్తే మీ మీ గ్రామా లన్నీ అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టి కన్వీనర్ వెందోటి. కార్తీక్ రెడ్డి, మండల జేఏసీ ఇన్చార్జి తాళ్లూరు వెంకట బంగారు ప్రసాద్ చౌదరి(బాబి),వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి,ప ల్లంటి.రాంబాబు నాయుడు, గోపాల్ యాదవ్, మల్లేల వెంకటేశ్వర్లు నాయుడు,బాబు రెడ్డి, రాజేష్ రెడ్డి,గంగధర్,మాధవ,ఈశ్వరయ్య,అంకయ్య,వెంకటనరసయ్య,గ్రామ సర్పంచ్ మల్లికార్జున కృష్ణ య్య,మాజీ సర్పంచ్ సత్యంమ్మ,రత్నం రాజు, నంధరాజు, సుధాకర్ రాజు,శంకర్ నాయుడు, మునివెంకటేశ్వర్లు నాయుడు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోటీ :-మాట్లాడుతూన్న రాజ్య లక్ష్మి