వెంకటగిరి … వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ఒకటో వార్డ్ కౌన్సిలర్ పేర్నెట్ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం వెంకటగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తిలను అత్యధిక మెజార్టీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు రాయపాటి శివకుమార్, మేకల శ్రీనివాసులు, నల్ల మేకల నాగరాజు, మేకల పెద్ద వెంకటయ్య, మేకల లోకనాథం, కలపాటి సాయి తేజ, హరి, గౌరీ, పెంచలయ్య, ఈరి శివకుమార్, వెంకటేష్, బి నాగరాజు, కే కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.